Monday, October 7, 2024

ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి

- Advertisement -
- Advertisement -

కథువా/జమ్మూ: జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని మారుమూల మాచెడి ప్రాంతంలో సోమవారం ఉగ్రవాదులు సైనిక సిబ్బంది వాహనంపై మెరుపు దాడి చేయగా ఐదుగురు సిబ్బంది మరణించగా మరో ఆరుగురు గాయప డినట్లు అధికారులు తెలియజేశారు. కథువా పట్టణానికి 150 కిమీ దూరంలో ని లోహాయి మల్హార్‌లో బద్నోటా గ్రామం సమీపాన సోమవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు మామూలు పహరాలో ఉన్న సైనిక వాహనాలు ల క్షంగా ఉగ్రవాదులు ఒక గ్రనేడ్ విసిరి, కాల్పులు జరిపారు. భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారని, కానీ ఉగ్రవాదులు సమీపంలోని అడవిలోకి పారిపోయారని అధికారులు చెప్పారు.

ఈ కాల్పుల్లో మొత్తం 10మంది సైనిక సిబ్బంది గాయపడగా వారిలో ఐదుగురు ఆసుపత్రిలో మరణించినట్లు అధికా రులు తెలిపారు. చివరి వార్తలు వచ్చినప్పుడు ఉగ్రవాదులు, భద్రత బలగాల కు మధ్య కాల్పుల పోరు సాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదు లను మట్టుబెట్టడానికి అదనపు బలగాలను ఆ ప్రాంతానికి పంపినట్లు, వారు ఇటీవల సరిహద్దు మీదుగా చొరబడి ఉందవచ్చునని, వారి ఎగువ ప్రదేశాల కు వెళ్లారని అధికారులు వివరించారు. ‘గాయపడిన నలుగురు ట్రూపర్లు ఉగ్ర వాదుల గ్రనేడ్ దాడికి, కాల్పులకు గురైన వాహనంలో ఉన్నారు’ అని అధికా రి ఒకరు తెలిపారు. గాయపడిన ఆరుగురు చికిత్స పొందున్నట్లు తెలిపారు. కాగా, గడచిన రెండు వారాల్లో కథువా జిల్లాలో ఇది రెండో పెద్ద ఘటన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News