Monday, January 27, 2025

కిలో గంజాయితో పట్టుబడిన సెక్యూరిటీ గార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కిలో గంజాయితో సెక్యూరిటీ గార్డుని ఎస్ఒటి సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా కు చెందిన సరోజ్ కుమార్ అనే వ్యక్తి వీర్చౌ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. అతడు గంజాయికి బానిస కావడంతో పాటు ఇతరులకు అమ్ముతున్నట్లు తెలిసింది. సరోజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతడి వద్ద కిలో గంజాయి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News