Friday, November 22, 2024

భారతీయుడు-2 సినిమా యూనిట్ ను ప్రశంసించిన రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ దుష్ప్రభావాలపై చిన్న వీడియో ద్వారా ప్రజలకు అవగాహన కల్పించిన భారతీయుడు-2 చిత్ర యూనిట్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం అభినందించారు. ఒక ట్వీట్‌లో, చిత్ర యూనిట్ సభ్యులను, ముఖ్యంగా ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ , మరో ఇద్దరు నటులు సిద్ధార్థ్ , పి. సముద్రఖని ని రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ లేని సమాజం కోసం చేసిన ప్రయత్నంలో సహాయాన్ని అందించినందుకుగాను ప్రశంసించారు.

40 సెకన్ల నిడివి గల వీడియోలో కమల్ హాసన్, “నమస్కారం, మీరు వెళ్లే దారి మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి దయచేసి డ్రగ్స్‌కు నో చెప్పండి. మీడియా ఈవెంట్‌లకు ఈ సందేశాన్ని ఇవ్వడం తప్పనిసరి చేసినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను – డ్రగ్స్‌కు నో చెప్పండి’’ అన్నారు.

ప్రజలకు తన సందేశంలో  సిద్ధార్థ్, “మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి డ్రగ్స్‌కు నో చెప్పండి. తెలంగాణ ప్రభుత్వ చొరవను నేను అభినందిస్తున్నాను ,మద్దతు ఇస్తున్నాను. అంతా మంచి జరుగుగాక” అని తెలిపారు. కమల్ హాసన్, సిద్ధార్థ్ శంకర్ అభిప్రాయాలను బలపరుస్తూ సముద్రఖని కూడా “దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దు” అన్నారు.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టిజిసిఎస్‌బి)లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి)కి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14 కొత్త నాలుగు చక్రాల వాహనాలు, 55 ద్విచక్ర వాహనాలకు జెండా ఊపిన  అనంతరం సినిమా నటీనటులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ‘‘ప్రతిసారీ థియేటర్లలో సినిమా విడుదల సమయంలో.. డ్రగ్స్ వ్యాప్తికి వ్యతిరేకంగా చిన్న వీడియో చేయాలి’’ అని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News