Friday, December 20, 2024

రాజ్ తరుణ్-లావణ్య వివాదం.. మరో కేసు పెట్టిన హీరోయిన్ మాల్వి

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన ప్రియురాలు లావణ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను రాజ్ తరుణ్ మోసం చేశాడని మొదట నార్సింగి పోలీసుకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ మాల్వి మల్హోత్ర వల్లే రాజ్ తరుణ్ తనను దూరం పెడుతున్నాడని ఆరోపించింది లావణ్య. రాజ్ తరుణ్ తో తన పెళ్లి కూడా అయిపోయిందని.. అతను తనకు కావాలని ఫిర్యాదు చేసింది. తరుణ్ తో మాల్వి ఎఫైర్ నడుపుతోందని.. అందువల్లే తనకు దూరం పెట్టాలని చూస్తున్నాడని తెలిపింది. మాల్వి కుటుంబ సభ్యులు తనను బెధిరిస్తున్నారని.. వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని లావణ్య మీడియా ముందు చెప్పింది.

దీనిపై ఇప్పటికే రాజ్ తరుణ్ స్పందించగా.. హీరోయిన్ మాల్వి, లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని.. వారి మధ్య గొడవలోకి తనను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడంలేదని మాల్వీ మీడియా ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి లావణ్యపై మాల్వి ఫిలీంనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తనకు, తన సోదరుడికి అసభ్యకర మెసేజ్ లు పెడుతుందని, బెదిరింపులకు పాల్పడుతుందని ఫిర్యాదులో పేర్కొంది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే.. లావణ్య కూడా మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గర ఉన్న ఆదారాలను పోలీసులకు సమర్పించింది. మరి, ఈ కేసు ఎటు వెళ్తుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News