Thursday, December 19, 2024

నలుగురి చావు గీతమార్చిన కార్మికుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అబ్దుల్లాపూర్‌మెట్: ఆర్థిక సమస్యలతో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకా రం… మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలానికి చెంది న అశోక్ (40) మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీహోమ్స్‌కాలనీలో భార్య పిల్లలతో నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం ఉదయం తన ముగ్గురు పిల్లలు అభిజ్ఞ (14), శ్రీధర్ (12), సహర్ష (9)లతో కలిసి వాకింగ్ పోదామం టూ చెప్పి ఇంట్లో నుండి కారులో బయలుదేరారు. ఉద యం 8 గంట సమయంలో

ఇనాంగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బైరాంఖాన్ చెరువు కట్టపై నుండి కారు వెళ్లి ఒక్కసారిగా చెరువులోకి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి కారులోని వారిని కాపాడేందుకు చెరువులోకి దిగారు. తాళ్లు, ట్యూబ్‌లతో వెళ్లి కారులోని వారిని తాడు సాయంతో బయటకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. ముగ్గురు పిల్లలు ఈ ఘటనతో కొంత సేపు భయాందోళనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తనకు వ్యాపారంలో వచ్చిన నష్టాలతో ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా విసుగు చెంది ఆత్మహత్యకు చేసుకోవాలని చూశాడని పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు తరలించి మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు. మీర్‌పేట్ సీఐ నాగరాజు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

వీడియో కాల్‌తో బంధువులకు సమాచారం…
ఇనాంగూడ చెరువు సమీపంలోకి రాగానే తండ్రి ముగ్గురు పిల్లలతో ఇదే మన చివరి చూపులు, పలకరింపులు అనే సరికి, వెంటనే పిల్లలు తమ బంధువులకు వీడియో కాల్ చేసి డాడీ ఇలా అంటున్నాడని తెలిపారు. ఈ లోపు కారు చెరువు కట్ట మీద నుండి నీటిలోకి దూసుకెళ్లిందని పిల్లలు కన్నీరు పెట్టుకున్నారు.
తాటి చెట్టుపై చూసిన కార్మికుడు
చెరువు సమీపంలో తాటి చెట్టు ఎక్కి పైన ఉన్న గీత కార్మికుడు కారు చెరువులోకి వెళ్తుండగా చూశాడు. వెంటనే తన కుమారుడు సాయికుమార్‌గౌడ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే వచ్చిన సాయికుమార్‌గౌడ్ స్థానికుల సహకారంతో చెరువులోకి వెళ్లి నలుగురిని కాపాడాడు. ఈ సందర్భంగా నలుగురి ప్రాణాలను కాపాడిన సాయికుమార్‌గౌడ్‌ను పలువురు ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News