Monday, December 23, 2024

భగవద్గీతపై ప్రమాణం చేసిని బ్రిటన్ ఎంపీ

- Advertisement -
- Advertisement -

లండన్: భారత సంతతికి చెందిన శివానీ రాజా(29) బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ఒట్టేసి ఎంపీగా ప్రమాణస్వీకారం చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె లౌసెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థిని అయిన ఆమె లేబర్ పార్టీకి చెందిన లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ పై గెలుపొందారు.

గుజరాత్ మూలాలున్న శివానీ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పోటీ చేసిన స్థానం లేబర్ పార్టీకి కంచుకోటగా ఉండేది. బ్రిటన్ పార్లమెంటుకు భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది ఎంపీలుగా ఎన్నికవ్వడం విశేషం. భారత సంతతికి చెందిన రిషి సునాక్ అధికారాన్ని కోల్పోయారన్నది తెలిసిన విషయమే. ఆయన స్థానంలో బ్రిటన్ ప్రధానిగా లేబర్ పార్టీ నేత కీర్ స్మార్టర్ బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News