Monday, November 18, 2024

యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రణీత్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, బుధవారం బెంగళూరులో ప్రణీత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రణీత్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ప్రణీత్‌పై 67 బి, ఐటి, పోక్సో, 79, 294 బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు బెంగళూరులో ప్రణీత్‌ను అదుపులోకి తీసుకోగా, ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ప్రణీత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అటు ప్రణీత్‌తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురు డల్లాస్ నాగేశ్వరరావు, బుర్రా యువరాజ్, సాయి ఆదినారాయణలపై కేసు నమోదైంది. వీరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ఎ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఎ3గా బుర్రా యువరాజ్, ఎ4గా సాయి ఆదినారాయణను చేర్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News