Monday, December 23, 2024

డిఎస్‌సి హాల్ టికెట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నెల 18 నుంచి నిర్వహించనున్న డిఎస్‌సి పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు tsdsc.aptonline.in/tsdsc వెబ్‌సైట్ నుంచి తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డిఎస్‌సి -2024 పరీక్షలు ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) విధానంలో డిఎస్‌సి పరీక్ష జరగనున్నది. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్‌సి పరీక్ష నిర్వహించనున్నారు. డిఎస్‌సి 2024 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4న ప్రారంభంకాగా…గత నెల 20వ తేదీతో గడువు ముగిసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News