Friday, December 20, 2024

కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్…. జైల్లోనే ఉన్నారు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ మరోవైపు సిబిఐ కేసులో కేజ్రీవాల్‌కు ఇంకా బెయిల్ రాకపోవడంతో ఆయన కస్టడీలోనే కొనసాగనున్నారు. కేజ్రీవాల్ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం బదిలీ చేసింది. అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చినా కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉన్నారు. గత నెల 27 నుంచి మధ్యం విధానం కేసులో ఆయన సిబిఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిఎం బాధ్యతల నుంచి తప్పుకునే విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలివ్వలేదని సుప్రీంకోర్టు తెలిపింది.

అరెస్టు చేసినందున సిఎం పదవి నుంచి దిగిపోవాలా లేదా అనే నిర్ణయం ఆయన ఇష్టమని పేర్కొంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా సిఎంగా కేజ్రీవాల్ ఉన్నారని కోర్టు వివరించింది. లిక్కర్ పాలసీ కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను కేజ్రీవాల్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్, ఇడి వాదనల అనంతరం మే 17కు తీర్పును సుప్రీం రిజర్వ్ చేసింది. జూన్ 20న కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసింది. సాధారణ బెయిల్‌పై మరుసటి రోజు ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఆదేశాలపై 25న ఢిల్లీ హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీచేసిన విషయం విధితమే. అ తరువాత కేజ్రీవాల్‌ను సిబిఐ అరెస్టు చేసినట్లు ప్రకటించింది. గత నెల 27న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి కోర్టు ముందు సిబిఐ హాజరుపరిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News