హైదరాబాద్: 2023 సంవత్సరానికి 68వ సౌత్ ఫిలింపేర్ అవార్డులను ప్రకటించారు. ఫిలింపేర్ అవార్డులు ఆర్‌ఆర్‌ఆర్, సీతారామం సినిమాలు దక్కించుకున్నాయి. తెలుగులో ఉత్తమ చిత్రంగా ఆర్‌ఆర్‌ఆర్‌కు రాగా ఉత్తమ దర్శకుడు రాజమౌళి దక్కింది. ఉత్తమ నటుడు రామచరణ్, జూనియర్ ఎన్‌టిఆర్, ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్‌ను వరించింది. విరాట్ పర్వం సినిమాలో నటించిన సాయిపల్లవికి ఉత్తమ నటి క్రిటిక్స్ విభాగం, ఉత్తమ సహాయ నటిగా నందితా దాస్‌కు అవార్డు వరించింది.
ఉత్తమ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్
ఉత్తమ దర్శకుడు రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నటి మృణాల్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శుడు కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి (సీతారామం)
ఉత్తమ గాయకుడు కాల భైరవ (ఆర్‌ఆర్‌ఆర్ కొమరం భీముడో)
ఉత్తమ గాయని (ఫిమేల్) చిన్మయి శ్రీపాద (సీతారామం)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) సీతారామం
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) దుల్కర్ సల్మాన్ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్) సాయి పల్లవి ( విరాట పర్వం)
ఉత్తమ సహాయ నటుడు రానా (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి నందితా దాస్ (విరాట పర్వం)
ఉత్తమ సినిమాటోగ్రఫీ సెంథిల్, రవి వర్మన్
ఉత్తమ ప్రోడక్షన్ డిజౌన్ సాబు సిరిల్ (ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నృత్య దర్శుడు ప్రేమ్ రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)