Monday, December 23, 2024

కెటిఆర్ కు షబ్బీర్ అలీ సవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు సవాలు విసిరారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులను ముందు ప్రోత్సహించిందెవరని నిలదీశారు. గతంలో టిడిపి నుంచి వచ్చిన తలసాని యాదవ్ ను ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయించకుండానే మంత్రిని చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అదే విధంగా మరో 46 మంది ప్రజా ప్రతినిధులను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని నిందించారు. తన మాటలు వాస్తవాలు కాదని రుజువు చేయమని కెటిఆర్ కు ఆయన సవాలు విసిరారు. తన మాటలు తప్పని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే కెటిఆర్ తన ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ వాళ్లంతా కాంగ్రెస్ లోకి వస్తారని…బిఆర్ఎస్ పార్టీ కూల్చడం ఖాయమని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News