Friday, October 18, 2024

జూన్ 25వ తేదీ రాజ్యాంగ హత్యాదినం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇకపై ప్రతి ఏటా జూన్ 25వ తే దీని ‘ రాజ్యాంగ హత్యా దినంగా స్మరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిం ది. 1975 జూన్ 25వ తేదీన అప్పటి ప్ర ధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీవిధించారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం గొంతుక నులిమివేత జరిగిందని, అప్పటి పరిణామాలలో పలు విధాలుగా బాధలు అనుభవించిన వారు, కటకటాల పాలయి న వారిని స్మరించుకునేందుక ఈ రోజును ప్రత్యేకంగా నిర్ధేశించుకోవడం జరిగిందని ,దేశంలో అమానుష ఘట్టానికి దారితీసిన రోజును ప్రత్యేకంగా నిర్వహించుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్ సామాజిక మాధ్యమంగా తెలిపారు. 25 జూన్‌ను సంవిధాన్ హత్యా దివస్‌గా ఖరా రు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ వెలువరించింది. ఎమర్జెన్సీ విధించిన రోజును గు ర్తు తెచ్చుకోవల్సి ఉంటుంది. ఇది దేశ ప్రజలకు చేదు అనుభవం మిగిల్చింది.

చీకటి అధ్యాయం అయిందని, వ్యక్తిగత స్వేచ్ఛ అణిచివేత హననం ఆరని జ్వాలగా ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనేది ఇ ప్పుడు ప్రతి భారతీయుడి మదిలో మెదలుతోందని పేర్కొన్నారు. అందుకే ప్రతి ఏటా ఎమర్జెన్సి బాధలను స్మరించుకునే ఈ రో జును ఖరారు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ గె జిట్ వెలువరించింది. అప్పటి ప్రధాని ఇం దిరా గాంధీ తమ నియంతృత్వ వైఖరితో దేశంలో తన అరాచాకానికి నాందీ పలికారని, అప్పటి ఎమర్జెన్సీని నిరసించడం అ ందరి కర్తవ్యమని ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఆలోచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దినం ప్రకటించిందని అమిత్ షా తమ ప్రకటనలో తెలిపారు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పాటుపడి, తమ జీవితాలను కూడా పెట్టిన వారిని తల్చుకోవడం మన అందరి కర్తవ్యం అని , అప్పటివారిని అందరిని స్మరించుకుని గౌరవించడం కీలకమని భావించి ఈ దివస్‌ను ఖరారు చేసుకున్నట్లు అమిత్ షా తెలిపారు. అణచివేతల ప్రభుత్వం చేతిలో అనేక రకాల చిత్రహింసలను భరించి దేశ ప్రజాస్వామిక ప్రక్రియను నిలబెట్టేందుకు అవసరమైన విధంగా ముందకు సాగిన వారిని వారి త్యాగాలను ప్రతి ఏటా స్మరించుకోవల్సి ఉంటుందని వివరించారు.

చీకటి రోజులను గుర్తు చేస్తుంది ః మోడీ
నాటి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అణగదొక్కి తన పాలనను ఏ విధంగా సాగించిందనేది చరిత్రలో నిలబడటానికి వీలుగా ఈ రాజ్యాంగ హత్యా దినం నిర్వహణను పాఇంచేందుకు నిర్ణయించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. అర్థరాత్రి వేళలో ప్రధాని ఇందిర గాంధీ వెలువరించిన ప్రకటనతో దేశ చరిత్రలో చీకటి అధ్యాయం నిలిచిందని, ఇక ముందు ఇటువంటి ఘట్టాలు తలెత్తకుండా జాతిని అప్రమత్తం చేసేందుకు ఎమర్జెన్సీ డేను ప్రజలకు తెలియచేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక వేదికగా తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెలువరించిన గెజిట్‌ను కూడా జతపర్చారు. ప్రజాస్వామ్య పరిరక్షకుల సేవలను గుర్తుపెట్టుకునేందుకు ఇదో వేదికఅవుతుంది. మనందరిని రాజ్యాంగ పరిరక్షణకు సంఘటితం చేస్తుందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News