Saturday, December 21, 2024

కేవలం రెండు వారాల కలెక్షన్స్ లో ‘ కల్కి 2898 ఏడి’ సినిమా రికార్డు!

- Advertisement -
- Advertisement -

రూ. 1000 కోట్లు దాటేసిన ‘కల్కి 2898 ఏడి’

హైదరాబాద్: ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించిన ‘కల్కి 2898ఏడి’ సినిమా రూ. 1000 కోట్ల కలెక్షన్ ను దాటేసింది. అది కూడా 16 రోజులకే. ఇప్పుడు గ్లోబల్ క్లబ్ లో రూ. 1000 కోట్లు సాధించిన భారతీయ సినిమాలు రెండే. ఒకటి 2017లో వచ్చిన ‘బాహుబలి-2’,  ఇప్పుడు ‘కల్కి 2898ఏడి’

16వ రోజున కల్కి సినిమా ఇండియాలో రూ.5.2 కోట్లు ఆర్జించింది. ఇది దేశీయంగా రూ. 548 కోట్లు ఆర్జించింది. ఈ సినిమా శనివారం రూ. 550 కోట్ల మైలు రాయిని దాటి దేశీయంగా అత్యధికంగా ఆర్జించిన సినిమాగా నిలబడనున్నది. దేశీయంగా ‘యానిమల్’ సినిమా కలెక్షన్ ను కూడా దాటనున్నది. ‘కల్కి 2898ఏడి’ విజయంతో ప్రభాస్ కు మళ్లీ మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు కొన్ని సినిమాలు(ఆది పురుష్, రాధేశ్యామ్ వంటివి) పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రభాస్ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోనే కాక, హిందీ బెల్టు లో కూడా మంచి గుర్తింపు సాధించాడు. కల్కి సినిమాను రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు కూడా మంచి పేరొచ్చింది.

దక్షిణాదిన ‘భారతీయుడు-2’, ఉత్తరాదిన ‘సర్ ఫిరా’ సినిమాలు విడుదలయినప్పటికీ  ‘కల్కి 2898 ఏడి’ ఇంకా విజయవంతంగా నడుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News