- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) ‘ట్రన్సాక్షన్ బిజినెస్ రూల్స్’ ను సవరించింది. దీంతో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఆల్ ఇండియా సర్వీసెస్, ట్రన్స్ ఫర్స్ అండ్ పోస్టింగ్స్ విషయాలలో మరిన్ని అధికారాలు కల్పించింది. ఈ సవరణలను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం 2019 లోని సెక్షన్ 55 కింద ఉన్న అధికారంతో చట్టంలోని సెక్షన్ 73 కింద శుక్రవారం తాజా నోటిఫికేషన్ జారీ చేశారు.
- Advertisement -