భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80ఏళ్ల వృద్ధురాలికి ఆసరా కింద తీసుకున్న రూ.1.72లక్షలు తిరిగి వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. పక్షవాతంతో బాధపడుతున్న మల్లమ్మకు కెసిఆర్ సర్కార్ ఇచ్చిన పెన్షన్ సొమ్మును తిరిగి గుంజుకోవడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం. ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోకపోతే ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌పై తిరగబడతారు.
– కెటిఆర్,
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పింఛన్ అందుతోంది. ఆమె అవివాహిత కుమార్తె రాజేశ్వరి వైద్యారోగ్య శాఖలో ఎఎన్‌ఎంగా పనిచేస్తూ 2010లో మరణించింది. కుటుంబ పెన్షన్ కింద నెలకు అప్పటికే రూ.24వేలు మల్లమ్మకు అందుతోంది. ఆమె ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వోద్యోగి. ఒకే వ్యక్తి ఇలా రెండు రకాల పెన్షన్లు తీసుకోవడానికి అనర్హులు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధాప్య, కుటుంబ పెన్షన్లను ఇలా 1826 మందిని గుర్తించాం. వారందరికీ ట్రెజరీ శాఖ రికవరీ నోటీసులు పంపింది. వాస్తవాలు ఇలా ఉంటే కొందరు రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు.
మంత్రి సీతక్క