Monday, December 23, 2024

జవాన్లపై దుండగుల కాల్పులు.. సిఆర్పీఎఫ్ జవాన్ మృతి

- Advertisement -
- Advertisement -

మణిపూర్ జిరిబామ్ జిల్లాలో ఆదివారం సాయుధ దుండగుల దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పిఎఫ్ ) జవాన్ మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిరిబామ్ జిల్లాలో సీఆర్‌పిఎఫ్ , పోలీస్ బృందాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. జులై 13న జరిగిన కాల్పుల సంఘటనకు సంబంధించిఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా ఉదయం 9జ40 గంటల సమయంలో కొందరు గుర్తు తెలియని సాయుధులు జవాన్లపై మెరుపుదాడికి పాల్పడ్డారు.

దుండగులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో బీహార్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ ఝాగా ( 43) ప్రాణాలు కోల్పోయాడు. జిరిబామ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సహా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. శుక్రవారం ఇంఫాల్ లోని ఖుయాదోంగ్, నాగమపాల్ ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉగ్రస్థావరాలను గుర్తించారు. అక్కడ ఉన్న మందుగుండు సామగ్రితోపాటు ఒక ఎక్స్‌కాలిబర్ రైఫిల్, మరో రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News