Saturday, November 23, 2024

ఛాంపియన్ అల్కరాజ్

- Advertisement -
- Advertisement -

కార్లోస్ అల్కరాజ్ మరోసారి ఛాంపియన్‌గా అవతరించాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. ప్రారంభం సెట్ నుంచి దూకుడు ప్రదరర్శించి అల్కరాజ్.. నిర్ణయాత్మక మూడో సెట్‌లో జకోవిచ్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. అద్భుతమైన ఆటతీరుతో నోవాక్ ఛాన్స్ ఇవ్వకుండా కైవసం చేసుకున్నాడు. దీంతో 6-2, 6-2, 7-6 జకోను ఓడించి ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. దాంతో, 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనుకున్న నోవాక్‌కు నిరాశ ఎదురైంది.

టోర్నీ వరుస విజయాలతో సెమీస్‌లోకి దూసుకొచ్చిన అల్కరాజ్.. డానిల్ మెద్వెదేవ్‌ను మట్టికరిపించి ఫైనల్లో అడుగుపెట్టాడు. నాదల్ వారసుడిగా ఈ స్పెయిన్ స్టార్ ఆదివారం స్పెయిన్ కోర్టులో చెలరేగాడు. సునయాసంగా తొలి సెట్ గెలుపొందిన అల్కరాజ్ అదే ఊపులో రెండో సెట్ కైవసం చేసుకుని నోవాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అయితే మూడో సెట్‌లో అనూహ్యంగా పుంజుకొన్న సెర్బియా స్టార్ అల్కరాజ్‌కు గట్టి పోటీనిచ్చాడు. కానీ.. ఆత్మవిశ్వాసం అల్కరాజ్ పోరాడి నోవాక్ ట్రోఫీ ఆశలపై నీళ్లు చల్లాడు. టైటిల్ దక్కాలంటే సర్వశక్కులూ ఒడ్డి టైటిల్ కైవసం చేసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News