Friday, December 20, 2024

2 కిలోల ఒపియం, 3.8 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలో వేర్వేరు ప్రాంతాలో 3.8 కిలో గంజాయి, 2 కిలో ఓపియమ్ మిక్డ్స్ పౌడర్ ను పోలీసులు పట్టుకున్నారు. 3.8 కిలోల గంజాయిని పట్టుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.  దుండిగల్ పోలీసు స్టేషన్ పరిది లో ఒడిశాకు చెందిన శుభకంత జెనా అనే యువకుడు ప్రీమియర్ ఇంజనీర్ కంపెనీలో సెక్యూరిటీ గా పని చేస్తున్నాడు. శుభకంతా ఒడిశా నుంచి 3.8 కిలోల గంజాయిని తీసుకొచ్చి అమ్ముతుండగా సైబరాబాద్ ఎస్ఒటి పోలీసులు,  దుండిగల్ పోలీసు సంయుక్తంగా పట్టుకోవడం జరిగింది.  దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అల్వాల్ లో రాజస్థాన్ కు చెందిన యువకుడు 2 కిలోల ఒపియం మిక్స్డ్ పౌడర్ ను అమ్ముతుండగా సైబరాబాద్ ఎస్ఒటి పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు పది లక్షలు ఉంటుందని అంచనా.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News