హైదరాబాద్: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన హైదరాబాద్ పరిధిలో జరిగాయి. ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ రోడ్డు దాటుతుండుగా కారు ఢీకొట్టడంతో అతడు మృతి చెందిన సంఘటన పోచారం ఐటి కారిడర్ ప్రాంతంలో జరిగింది. రాయదుర్గంలోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొట్టడంతో అతడు ఫ్లైఓవర్ పైనుంచి కిందపడి దుర్మరణం చెందాడు. మృతుడు సుబ్బారావు బైక్‌పై అల్పాహారం విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -