Sunday, December 22, 2024

BS6 OBD II శ్రేణిపై మైలేజ్ గ్యారంటీని ఆవిష్కరించిన మహీంద్రా

- Advertisement -
- Advertisement -

పుణె: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) కమర్షియల్ వాహన విభాగంలో అగ్రగామిగా కొనసాగుతూ, తమ మొత్తం BS6 OBD II శ్రేణి వాహనాలపై కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మకమైన ప్రతిపాదనను ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన ధరలు, నియంత్రణపరమైన ప్రమాణాలతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంలో తోడ్పడేందుకు పరిశ్రమలోనే తొలిసారిగా ‘మరింత మైలేజీ పొందండి లేదా ట్రక్కును వాపసు చేయండి’ (‘Get More Mileage or Give the Truck Back’) అనే ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. BS6 OBD II శ్రేణిలో హెచ్‌సీవీ, ఐసీవీ మరియు ఎల్‌సీవీ ట్రక్కులకు సంబంధించి బ్లేజో ఎక్స్, ఫ్యూరియో, ఆప్టిమో, జయో (BLAZO X, FURIO, OPTIMO, JAYO) ఉన్నాయి.

కొత్త శ్రేణిలో సమర్ధమంతమైనవిగా నిరూపించుకున్న 7.2L mPower ఇంజిన్ (HCVలు) మరియు ఫ్యూయల్‌స్మార్ట్ టెక్నాలజీ గల mDi టెక్ ఇంజిన్ (ILCV), తక్కువ Ad Blue వినియోగానికి దారి తీసే ఆఫ్టర్ ట్రీట్‌మెంట్ సిస్టం గల మైల్డ్ EGR, అధునాతన iMAXX టెలీమ్యాటిక్స్ సొల్యూషన్‌తో పాటు మరెన్నో అధునిక సాంకేతికతలు ఉన్నాయి. ఇవన్నీ అధిక మైలేజీ హామీనిస్తాయి. ఈ మైలేజీ హామీ అనేది ఇంధన ఆదాకు మాత్రమే పరిమితం కాకుండా అత్యంత తక్కువ Ad Blue వినియోగానికి కూడా హామీనిస్తుంది. కాబట్టి మహీంద్రా యొక్క మైలేజీ గ్యారంటీ అంటే ఆయా విభాగాల్లో అత్యుత్తమ “ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీ”గా పరిగణించవచ్చు.

ఈ మెరుగుదలలు సమర్ధమంతంగా పనిచేస్తున్నాయనేది నిర్ధారించుకునేందుకు, పోటీ సంస్థల వాహనాలతో పాటు మహీంద్రా మొత్తం 21 కేటగిరీల్లో 71 మోడల్స్‌తో కఠినతరమైన ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీ (డీజిల్ + Ad Blue) పరీక్షలు నిర్వహించింది. వివిధ లోడ్, రోడ్డు పరిస్థితుల్లో సుమారు 1 లక్ష కిలోమీటర్ల మేర ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి. వీటి ఫలితాలు, అసాధారణమైన మైలేజీని అందించాలన్న మహీంద్రా నిబద్ధతను పునరుద్ఘాటించేవిగా ఉన్నాయి. ఈ పరీక్షలన్నీ ఒక స్వతంత్ర విశ్వసనీయ ఏజెన్సీ పర్యవేక్షణలో నిర్వహించబడి, ధృవీకరించబడ్డాయి. ఇది కమర్షియల్ వాహన పరిశ్రమలో విశ్వసనీయత, సమర్ధత విషయాల్లో మహీంద్రాకు గల ఖ్యాతిని మరింత ఇనుమడింప చేసే విషయం.

“ట్రక్కుల శ్రేణివ్యాప్తంగా ‘గెట్ మోర్ మైలేజ్ ఆర్ గివ్ ది ట్రక్ బ్యాక్’ గ్యారంటీ అనేది ఒక కీలకమైన ప్రతిపాదన. మా అత్యుత్తమ హై-టెక్‌ అనుభవాన్ని, సెగ్మెంట్‌పైన మరియు ఎప్పటికప్పుడు మారుతున్న కస్టమర్ల అవసరాలపైనా మాకున్న అపార అవగాహనను ఇది ప్రతిబింబిస్తుంది. విస్తృతంగా నిర్వహించిన ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీ టెస్టింగ్ దన్నుతో ప్రకటించిన ఈ మైలేజీ గ్యారంటీ ప్రోగ్రాం అనేది కస్టమర్లను సంతృప్తిపర్చడంలోనూ, నిర్వహణ సామర్ధ్యాలను మెరుగుపర్చడంలోనూ మాకున్న ఎనలేని నిబద్ధతకు నిదర్శనంగా నిలవగలదు. ఇలాంటి కార్యక్రమాలతో కస్టమర్ల మనసులను గెల్చుకుని, భారతదేశపు అగ్రగామి కమర్షియల్ సంస్థల్లో ఒకటిగా మహీంద్రా మరింతగా ఎదగగలదు” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ప్రెసిడెంట్ (ట్రక్స్, బసెస్, సీఈ, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెసెస్), మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడు శ్రీ వినోద్ సహాయ్ తెలిపారు.

“మా వాహనాల్లో ఉపయోగించే అత్యుత్తమ సాంకేతికతే అధిక ఫ్లూయిడ్ ఎఫీషియెన్సీకి దోహదపడింది. 2016లో మేము BS3 శ్రేణికి మైలేజ్ గ్యారంటీని ప్రవేశపెట్టాం. ఆ తర్వాత BS4, BS6 OBD1లకు కొనసాగించాం. ఇప్పుడు BS6 OBD2 కోసం ఆవిష్కరిస్తున్నాం. ఇది ట్రాన్స్‌పోర్టర్ల లాభదాయకతను పెంచేందుకు సహాయకరంగా ఉండగలదు. ఫ్రైట్ రేట్లు పెరగకుండా ఇంధన వ్యయాలు పెరిగిపోవడం వల్ల ట్రాన్స్‌పోర్ట్ క్లయింట్ల మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడుతుండటాన్ని మేము గమనించాం. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా, అలాగే మా కస్టమర్ల అంచనాలకు మించి పనితీరు కోసం ఇంధన సామర్ధ్యాలను మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని గుర్తించాం. “జ్యాదా మైలేజ్ నహీతో ట్రక్ వాపస్” నినాదంతో ప్రవేశపెట్టిన కొత్త మైలేజీ గ్యారంటీ ప్రోగ్రాం అనేది మా కస్టమర్లకు అసమానమైన ప్రయోజనాలు చేకూర్చగలదు” అని మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) శ్రీ జలజ్ గుప్తా తెలిపారు.

మహీంద్రా ట్రక్స్‌లో iMAXX టెలిమ్యాటిక్స్ టెక్నాలజీ ఉంది. ఇది ఫ్లీట్ కార్యకలాపాలను రియల్‌-టైమ్‌లో పర్యవేక్షించేందుకు, మెరుగుపర్చేందుకు ఉపయోగపడగలదు. ఈ ట్రక్కుల్లో ఉన్న డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టం వాహన పనితీరు మరియు డ్రైవర్ ప్రవర్తనను రియల్‌-టైమ్‌లో పర్యవేక్షించేందుకు, తద్వారా కార్యకలాపాలను సురక్షితంగా, సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు సహాయపడుతుంది. ఫ్లీట్ పనితీరు గురించి కీలకమైన సమాచారాన్ని అందించడం ద్వారా కస్టమర్లు పూర్తి పరిజ్ఞానంతో తగు నిర్ణయాలు తీసుకునేందుకు, లాభాలను పెంచుకునేందుకు ఈ సిస్టం సహాయకరంగా ఉంటుంది.

మహీంద్రా అందించే, వర్క్‌షాప్‌లో 36 గంటల గ్యారంటీ టర్నెరౌండ్, mAahshray ప్రోగ్రాం కింద డ్రైవర్లకు అయిదు లక్షల రూపాయల క్యాజువాల్టీ కవరేజీ, అత్యవసర పరిస్థితుల్లో ట్రక్ డ్రైవర్ల కోసం వివిధ భాషల్లో 24/7 సపోర్ట్ వంటి పలు స్కీములతో కస్టమర్లు నిశ్చింతగా ఉండొచ్చు.

ఎంటీబీడీ సర్వీస్ నెట్‌వర్క్‌ ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. 400 పైచిలుకు టచ్ పాయింట్స్ ఉన్నాయి. వీటిలో 3S డీలర్‌షిప్‌లు 80 ఉన్నాయి. అలాగే 2,900 పైగా రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ పాయింట్లు, 1,600 పైగా రిటైల్ అవుట్‌లెట్స్‌లో స్పేర్స్ నెట్‌వర్క్ ఉంది. ఇవన్నీ భారతదేశవ్యాప్తంగా కీలక ట్రకింగ్ రూట్స్‌లో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News