Monday, December 23, 2024

పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలకు రూ.150 కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెడింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల జీతాల చెల్లించేందుకు రూ.150 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ కమీషనర్ అనితా రాంచంద్రన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్ని నెలలుగా పంచాయతీ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 29,676 మంది కార్మికులకు ఈ మొత్తాన్ని వేతనాలుగా చెల్లించాలని జిల్లాల వారీగా వివరాలను తెలియజేస్తూ ఉత్తర్వులు విడుదయ్యాయి. మే నెల వరకు ఉన్న వేతన బకాయిలు చెల్లించేందుకు ఈ మొత్తం విడుదల చేశామని, ఇందుకు అనుగుణంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News