Saturday, November 23, 2024

సుప్రీంకోర్టు న్యామూర్తులుగా కోటీశ్వర్ సింగ్, ఆర్. మహాదేవన్ నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కోటీశ్వర్ సింగ్, ఆర్.మహాదేవన్ ల నియామకాన్ని కేంద్రం ప్రకటించింది. జస్టిస్ కోటీశ్వర్ సింగ్ జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తుండగా, ఆర్. మహాదేవన్ మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు.

సింగ్ గత ఫిబ్రవరిలో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన ఫిబ్రవరి 15, 2023న ప్రమాణ స్వీకారం చేశారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి ఆయన.

జస్టిస్ ఆర్. మహాదేవన్ మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, వెనుకబడిన తరగతికి చెందినవారు. మద్రాసు లా కాలేజీలో లా డిగ్రీ పూర్తి చేసి 1989లో లాయర్‌గా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు. 25 సంవత్సరాలు, ఆయన పరోక్ష పన్నులు, కస్టమ్స్,సెంట్రల్ ఎక్సైజ్ విషయాలపై దృష్టి సారించి సివిల్, క్రిమినల్ , రిట్ కేసులలో నైపుణ్యం సాధించారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News