- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో రాగల ఐదురోజుల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న దక్షిణ ఒడిశా పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ప్రస్తుతం… దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ను , విదర్భను ఆనుకొని ఉందని.. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా వొంగి ఉందని పేర్కొంది.
అల్పపీడనం ఈ నెల 19న పశ్చిమ మధ్య ప్రాంతాలను ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
- Advertisement -