Saturday, November 16, 2024

రేపు నగరంలో బీబీ కా ఆలం ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జులై 17(బుధవారం)న నగరంలోని డబీర్ పురా లోని బీబి కా ఆలవ నుంచి ‘బీబీ కా ఆలం’ ఊరేగింపు జరుగనున్నది.  ముస్లింల హిజ్రీ క్యాలండర్ ప్రకారం ముహర్రం 10వ రోజున ‘యౌమ్-ఎ-అషూర’ సందర్భంగా ఈ ఊరేగింపు జరుగనున్నది. ఊరేగింపు షేఖ్ ఫైజ్ కమాన్, యాకుత్ పురా, ఏతెబార్ చౌక్, అలీజా కోట్ల, మాల్వాల ప్యాలెస్, చార్మినార్, గుల్జార్ హౌజ్, పంజేషా, మీరాలం మండీ, దారుల్ షిఫా, అజా ఖానా జొహ్రా, కాలి ఖబర్ గుండా చాదర్ ఘాట్ వద్ద ముగుస్తుంది. ఈ ఊరేగింపు దాదాపు 9 కిమీ. పొడవునా కొనసాగనున్నది.

షియా తెగకు చెందిన వేలాది మంది కత్తులు, కటారులతో నెత్తురొడ్డేలా తమని తాము కోసుకుని ‘మాతం’ నిర్వహించనున్నారు. ఊరేగింపును చూసేందుకు దారి పొడవున జనం బారులు తీరనున్నారు. ట్రాఫిక్ చూసి వెళ్లండి. ఊరేగింపులో బీబీ కా ఆలం ‘ధట్టీ’ ప్రదర్శిస్తారు. ఊరేగింపు రూట్ పొడవున పోలీస్ బందోబస్తు ఉండనున్నది. పూర్వం ఖుతుబ్ షాహి కాలంలో రూపవతి ఏనుగు తో ఈ ఆలం ఊరేగింపు నిర్వహించేవారు. ఆ ఏనుగును ముహర్రం ఊరేగింపు కోసం కర్నాటక నుంచి తీసుకొచ్చేవారు.

ముహమ్మద్ ఖుతుబ్ షా(ఐదవ పాలకుడు) గోల్కొండ వద్ద తన భార్య బీబీ ఫాతిమ జ్ఞాపకార్థం ‘ఆలం’ను నెలకొల్పారు. తర్వాత నిజాం కాలంలో (1724-1948)ను డబీర్ పురాలోని బీబీ కా అలావ వద్దకు మార్చారు. ‘ఆలం’ అనేది ఓ కర్ర.  ఆ కర్రను ఇరాఖ్ లోని కర్బలా నుంచి గోల్కొండకు తీసుకొచ్చారు. అది కూడా గోల్కొండ రాజు అబ్దుల్లా ఖుతుబ్ షా కాలంలో అని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News