Saturday, November 23, 2024

నేడు తొలి ఏకాదశి.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

నేడు తొలి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ, వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణలోని వేములవాడు, కొమురవెల్లి, యాదాద్రి వంటి ప్రముఖ ఆలయాలకు భక్తుల తాకిడి నెలకొంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పలు ఆలయాలకు భక్తులతో కిక్కిరిసిపోయాయి. పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో దీపాలు వెలగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దైవ స్మరణలో నిమగ్నమవుతారు.

అటు ఎపిలోనూ ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. శ్రీశైలం మల్లన్న, విజయవాడ కనకదుర్గ, సింహాచలం వంటి పుణ్య క్షేత్రాలకు భక్తులు చేరుకుని దర్శించుకుంటున్నారు.

కాగా ఏకాదశి సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో ఇప్పటికే అన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దని దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News