హైదరాబాద్: ఇస్లామీ క్యాలెండర్ నెల ముహర్రం 10 వ రోజున నేడు పాత బస్తీలో ‘యౌమే అషూర’ నిర్వహించారు. ఈ సందర్భంగా బీబీ కా ఆలమ్ ఊరేగింపును బీబీ కా అలావ నుంచి చాదర్ ఘాట్ వరకు జయప్రదంగా నిర్వహించారు. ముస్లింలలో ఒక వర్గం అయిన షియా తెగ వారు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ‘ఆలమ్’ అనేది ఓ పవిత్ర కర్ర లేక జెండా. ఇది ‘కర్బలా’ పోరుకు గుర్తు.
హైదరాబాద్ పాతబస్తీలోని అలీజా కోట్లా, పురానీ హవేలీ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహించడమే కాక ఫుడ్ క్యాంప్ లు కూడా ఏర్పాటు చేశారు. నేడు పాత బస్తీలో చాలా వరకు దుకాణాలను మూసి ఉంచారు. చివరికి ఊరేగింపు చాదర్ ఘాట్ లోని మజీద్-ఏ-ఇలాహి వద్ద ముగిసింది.
చార్మినార్ వద్ద పోలీస్ కమిషనర్ కె. శ్రీనివాస్ రెడ్డి , తదితర పోలీసు అధికారులు ‘ధట్టీ’ లను అర్పించుకున్నారు.
The Annual Bibi Ka Alam procession at Yakuthpura in the Old City, Hyderabad. pic.twitter.com/mTZJRJwKsO
— The Siasat Daily (@TheSiasatDaily) July 17, 2024