Monday, December 23, 2024

కెసిఆర్ లాగా రైతులను మభ్యపెట్టడం లేదు: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రుణమాఫీ పేరుతో కెసిఆర్ లాగా మాటలు చెప్పి రైతులను మభ్యపెట్టడం లేదని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, అందుకే ఏకమొత్తంలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అని ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు వివరించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామని సగర్వంగా చెప్పండని, దీనిపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News