Monday, December 23, 2024

సిక్కిం మాజీ మంత్రి పౌడ్యాల్ మృతదేహం బెంగాల్ కాలువలో లభ్యం

- Advertisement -
- Advertisement -

సిక్కిం మాజీ మంత్రి ఆర్‌సి పౌడ్యాల్ జాడ తెలియకుండా పోయిన తొమ్మిది రోజుల తరువాత ఆయన మృతదేహం పశ్చిమ బెంగాల్ సిలిగురి సమీపాన ఒక కాలువలో కనిపించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. 80 ఏళ్ల పౌడ్యాల్ మృతదేహం మంగళవారం ఫూల్బరిలో తీస్తా కాలువలో తేలుతూ కనిపించిందని వారు తెలిపారు. ‘ఎగువ నుంచి తీస్తా నదిలో మృతదేహం కొట్టుకువచ్చిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. ఆయన ధరించిన వాచీ, దుస్తుల ద్వారా గుర్తించడమైంది’ అని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు చెప్పారు.

పౌడ్యాల్ పక్యాంగ్ జిల్లాలోని సొంత పట్టణం ఛోటా సింగ్టమ్ నుంచి ఈ నెల 7న అదృశ్యమైన తరువాత ఆయన జాడ తీయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘ఆయన మృతిపై దర్యాప్తు కొనసాగుతుంది’ అని పోలీస్ అధికారి చెప్పారు. పౌడ్యాల్ సిక్కిం తొలి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్. ఆ తరువాత ఆయన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News