- Advertisement -
ఒమన్ రాజధాని ముస్కట్‌లో ఒక షియా మసీదు సమీపాన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద బృందం జరిపిన కాల్పుల్లో ఒక భారత జాతీయుడు మరణించగా, మరి ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వారు చాలా వరకు విదేశీయులే. ఇమామ్ అలీ మసీదు సమీపాన సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్, నలుగురు పాకిస్తాన్ జాతీయులు మృతి చెందగా, మరి 28 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన భారత జాతీయుడు బాషా జాన్ అలీ హుస్సేన్ అని ముస్కట్‌లో భారత రాయబార కార్యాలయం బుధవారం తెలియజేసింది. సోమవారం నాటి కాల్పుల సంఘటన తరువాత భారతీయ సమాజం సంక్షేమం గురించి తాము ఆరా తీస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. కాగా, ఈ దాడికి తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద బృందం ప్రకటించింది.
- Advertisement -