హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ ప్రాంతంలో జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం చూపించారు. బుధవారం గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్ళే దారిలో ఓ లారీ డ్రైవర్ ను జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్సై యాదగిరి పట్టుకొని కొట్టడమే కాకుండా బండ బూతులు తిట్టారు. లారీ సాంకేతిక సమస్యతో ఆగింది అంటే కూడా వినకుండా, నో పార్కింగ్ లో వాహనం నిల్పినందుకు కొడుతూ, బూతు పురాణం సదరు ఎస్ఐ అందుకున్నాడు. పక్క రాష్ట్రాల డ్రైవర్లకు మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా ఈ పోలీస్ అధికారికి ట్రైనింగ్ ఇచ్చి విధులల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహన దారులు కోరుతున్నారు. రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చాలన్లు వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ, చేయి చేసుకోవడం ఏంటని వాహన దారులు మండిపడుతున్నారు.
చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా..
పాలించేటోడు ఎట్లుంటడో
కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటదిఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీడ్రైవర్ పైన చేయిచేసుకొని దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.
తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏంది?
ఫ్రెండ్లీ… pic.twitter.com/JzynmcMoun
— BRS Party (@BRSparty) July 18, 2024