Saturday, November 23, 2024

సాధారణ పౌరుడిని ఎస్ఐ అలా తిడుతారా… డిజిపి: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పోలీసుల వ్యవహార శైలిపైన డిజిపి జితేందర్ ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి ప్రశ్నించారు. లారీ డ్రైవర్ ను జీడిమెట్ల ట్రాఫ్రిక్ ఎస్ఐ యాదరిగి కొట్టడంతో పాటు బండబూతులు తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వినరాని భాషలో పోలీస్ సిబ్బంది సాధారణ పౌరుడిని దుర్భాషలాడడంపై కెటిఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పోలీస్ శాఖ, డిజిపికి అంగీకారయోగ్యమైన బాషేనా? అని అడిగారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని చురకలంటించారు. ఈ మధ్య కాలంలో పోలీసులు ప్రజలతో ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందని, పదుల సంఖ్యలో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వస్తున్న పోలీసులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజలతో నేరుగా తమ విధులను నిర్వర్తించే పోలీస్ సిబ్బందికి పౌరులతో వ్యవహరించే విషయంలో ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని డిజిపికి సూచించారు.

చెట్టు ఒకటైతే విత్తనం మరొకటవుతుందా? పాలించేటోడు ఎట్లుంటడో కింద వ్యవస్థ కూడా అట్లనే ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ దగ్గర లారీడ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి చేయిచేసుకోవడంతో పాటు దుర్భాషలాడారు. తప్పు చేస్తే జరిమానా విధించాలి లేదా కేసు ఫైల్ చేయాలి కానీ దూషించుడు ఏంటని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.  ఫ్రెండ్లీ పోలీసింగ్ తీసేసి బూతుల పోలీసింగ్ తెచ్చుడేనా? కాంగ్రెస్ మార్పు అంటే అని ట్వీట్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News