- Advertisement -
హైదరాబాద్: నేడు రాష్ట్రవ్యాప్తంగా లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలుకు రంగం సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నేడు సాయంత్రం 4.00 గంటలకు ఈ రుణమాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్ లో షేర్ చేసింది. అంతేకాక రేవంత్ రెడ్డి వరినాట్లు వేస్తున్న పాత వీడియోను కూడా పోస్ట్ లో పెట్టింది.
తెలంగాణ యాసతో నిర్మించిన ‘బలగం’ సినిమాలోని ‘ఊరూ పల్లెటూరు’ పాటతో ఎడిట్ చేసిన సిఎం రేవంత్ రెడ్డి వీడియోను సీతక్క షేర్ చేసింది. పైగా ‘రైతు రుణమాఫీ సంబురం… రాష్ట్రమంతా పండుగ వాతావరణం’ అని వ్యాఖ్య కూడా పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది.
రైతన్నల రుణమాఫీ సంబురం..
రాష్ట్రమంతా పండుగ వాతావరణం..
— Danasari Seethakka (@seethakkaMLA) July 18, 2024
- Advertisement -