భూమి వివాదం వ్యవహారంలో కొందరిని పిస్టోల్‌తో బెదిరించిన కేసులో వివాదాస్పద ట్రెయినీ ఐఎఎస్ పూజా ఖేడ్కర్ తల్లి మనోరమ ఖేడ్కర్‌ను గురువారం పుణె పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లా లోని మహాద్‌లో గురువారం ఉదయం ఆమెను అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. పుణె కోర్టులో ఆమెను హాజరు పర్చగా జులై 20 వరకు కోర్టు మనోరమ ఖేడ్కర్‌కు రిమాండ్ విధించింది. అంతకు ముందు ఆమె కోసం పోలీస్‌లు గాలించారు. మహాద్ లోని హిర్‌కనివాడి వద్ద లాడ్జిలో ఆమె దాగున్నట్టు పోలీస్‌లు చెప్పారు.
అరెస్ట్ చేసిన తరువాత ఆమెను పుణె జిల్లా పాడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చారు. పుణె లోని ముల్షి తహసీల్ పరిధి లోని ధద్వాలి గ్రామంలో భూ వివాదం విషయంలో ఆమె తన సెక్యూరిటీ గార్డులతో కలిసి తుపాకీతో బెదిరింపులకు దిగినట్టు వీడియో వైరల్ కావడంతో పోలీస్‌లు మనోరమను, ఆమె భర్త దిలీప్ ఖేడ్కర్‌ను పట్టుకోడానికి గాలింపు ప్రారంభించారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణల కింద వీరిపైన మరో ఐదుగురిపైన భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) 323 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అమెరికా