Monday, December 23, 2024

శ్వాగ్ సినిమాలో సింగరో సింగ..

- Advertisement -
- Advertisement -

శ్రీవిష్ణు, హసిత్ గోలీ కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ’రాజ రాజ చోర’తో బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చారు. సైడ్- స్ప్లిట్టింగ్ ఎంటర్‌టైనర్ ’శ్వాగ్’ కోసం వారు రెండోసారి చేతులు కలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ సింగరో సింగను విడుదల చేయడం ద్వారా మ్యూజిక్ ఫెస్ట్‌ని ప్రారం భించారు. సోషల్ మీడియా సెన్సేషన్ అయిన సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేశారు. వివేక్ సాగర్ ఎక్స్‌ట్రార్డినరీ కంపోజిషన్, నిక్లేష్ సుంకోజీ ఆకట్టుకునే లిరిక్స్, బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మిల ఎనర్జిటిక్ వోకల్స్ పాట ఇన్‌స్టంట్‌గా నచ్చేలా చేస్తుంది. ఈ పాటలో శ్రీవిష్ణు ఎక్స్‌ప్రెషన్స్ ఎంటర్‌టైనింగ్‌గా వున్నాయి. వింజమర వంశంలో క్వీన్ రుక్మిణి దేవిగా రీతూ వర్మ నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News