- Advertisement -
హైదరాబాద్: కోఠిలోని ఆరోగ్య వైద్య విద్య కమిషనరేట్ లో హైడ్రామా నెలకొంది. ప్రభుత్వ ఎఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్, జనరల్ బదిలీల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. ప్రియారిటి, ఆప్షన్ ఫామ్ లేకుండానే ప్రభుత్వ వైద్య సిబ్బందిని అధికారులు బదిలీ చేశారు. యూనియన్ లీడర్ల సమక్షంలో ఇష్టానుసారం ఎఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ పోస్టులను కోరిన చోటకు బదిలీ చేశారు. పారదర్శకత లేకుండా తమను బదిలీ చేస్తున్నారంటూ తెల్లవారుజాము వరకు ఎఎన్ఎం, స్టాఫ్ నర్స్, హెడ్ నర్స్ ఆందోళన చేపట్టారు. బదిలీలు గందరగోళానికి గురి కావడంతో వైద్య విద్య కుటుంబ సంక్షేమ కమిషనర్ డాక్టర్ అజయ్ చేతులెత్తేశారు.
- Advertisement -