Friday, November 22, 2024

రుణమాఫీ పేరుతో ప్రభుత్వం మోసం: ఎంపి డికే అరుణ

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణామాఫీ పేరుతో నయా మోసానికి తెర లేపిందని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లడుతూ ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన రైతు భరోసా ఎగవేసి, ఇప్పుడు ప్రభుత్వం రుణమాఫీ అంటూ ఊరూరా హడావుడి చేస్తోందని మండిపడ్డారు. రూ.లక్ష లోపు తీసుకున్న రుణాల్లో అందులో సంగం మందికి కూడా రుణమాఫీ కాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ముప్పుతిప్పలు పడుతోందని ఎద్దేవా చేశారు.

ఇక గత్యంతరం లేక ఖరీఫ్ రైతు భరోసాకు ఎగనామం పెట్టి రుణ మాఫీ అంటూ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఒక్క మహబూబ్‌నగర్ పరిధిలోని ఒక్క డీసీసీ బ్యాంక్‌లో 68,495 మంది రైతులు అప్పులు తీసుకున్నాని తెలిపారు. అందులో రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న వారు 51,415 మంది ఉన్నారని పేర్కొన్నారు. వారిలో ప్రభుత్వం 20,130 మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని వివరించారు. దీంతో ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ, ప్రజలను నిండా మోసం చేస్తుందని మండిపడ్డారు. పైగా రుణమాఫీ మొత్తం చేశామంటూ సీఎంతో సహా మంత్రులు మీడియా ముందు చెప్పడం హాస్య్స్పాదంగా ఉందని డీకే అరుణ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News