ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా..గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో కూ డా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలతో వాగులు వం కలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. మేడిగడ్డ బ్యారేజి వద్ద 3.41లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, 85గేట్లు ఎత్తివేసి వచ్చి న నీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలిపెడుతున్నారు. త్రివేణి సంగమం జలకళను సంతరించుకుంది. వరదనీరు ఏడు మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.
ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు 16110క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 16.96టిఎంసిలకు చేరుకుంది. కడెం ప్రాజెక్టులోకి కూడా 4156 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 5.07టిఎంసీలకు పెరిగింది. శ్రీపాద ఎల్లంపల్లిప్రాజెక్టులోకి స్వల్పంగా 1405క్యూసెక్కుల నీరు చేరుతుండా గా ప్రాజెక్టులో నీటినిలువ 5.29టిఎంసీలకు చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు జలశయానికి భారీగా వ రద చేరుతోంది. ప్రాజెక్టు 24గేట్లు ఎత్తివేసి 59330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద 26 అడుగులకు నీటి
దిగువకు వెళుతున్న కొలది ఉపనదుల ద్వారా వస్తున్న వరదనీటితో భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమ ట్టం 26
పెరిగింది. నదిలో నీటిమట్టం స్నా నఘట్టాలకు చేరుకుంది. 43అడుగులకు చేరితే మొద టి ప్రమాదహెచ్చరికను జారీ చేయనున్నారు. గోదావరికి వరద ప్రవాహాలు మరింత పెరుగుతాయని కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించింది. తుపాకుల గూడెం వద్ద సమక్కసాగర్ బ్యారేజీ మీదుగా 3.71లక్షల క్యూ సెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. దుమ్ముగూడెం వద్ద సీతారామసాగర్ వద్ద గోదావరిలో 3.47లక్షల క్కూసెక్కుల వరదనీరు ప్రవహిస్తోంది.
శ్రీశైలంకు పెరిగిన వరద :
ఎగువన మహారాష్ట్ర , కర్ణాటక రాష్ట్రాల్లో కృష్ణనది పరివాహకంగా ఉన్న పలు ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి 1.07లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతొంది. ప్రాజెక్టులో నీటిమట్టం వేగంగా పెరుగుతూ వస్తోంది. శుక్రవారం సాయంత్రానికి జలశయంలో నీటినిలువ 59.80టిఎంసీలకు చేరుకుంది.ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఎగువనుంచి 61138క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా జలాశయంలో నీటినిలువ 101టిఎంసీలకు పెరిగింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసి 65వేలక్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణానదిలోకి వదులుతున్నారు.
నారాయణపూర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 62వేలక్యూసెక్కుల నీరు చేరుతోంది. రిజర్వాయర్‌లో నీటినిలువ ఇప్పటికే గరిష్టస్థాయికి చేరుకుంది. నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు తెరిచి 68810క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి 65వేలక్యూసెక్కుల నీరు చేరుతుండగా ,రిజర్వాయర్ నుంచి 37905క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 32673క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 33.11టిఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 7063క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల:
తెలంగాణ రాష్ట్రలో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమకాలువకు శుక్రవారం నాడు నీటిని విడుదల చేశారు. రోజుకు 5000క్యూసెక్కువ చొప్పున నాలుగు రోజులపాటు మొత్తం 1.5టిఎంసీల నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. మరో వైపు కుడికాలువకు కూడా నీటి విడుదల కొనసాగుతోంది.