Monday, December 23, 2024

మైక్రోసాఫ్ట్ ఔటేజ్ పై అమెరికా హెచ్చరిక జారీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఔటేజ్ కారణంగా హ్యాకర్లు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారని అమెరికా సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సిఐఎస్ఏ హెచ్చరించింది. మైక్రోసాఫ్ట్ సిస్టం ను తిరిగి సురక్షితం చేసేందుకు తీవ్రంగా పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సిఈవో సత్యా నాదెళ్ల అన్నారు.

ఫిషింగ్ ఈమెయిల్స్ లేక అనుమానస్పద లింకులపై క్లిక్ లు చేయకూడదని యూఎస్ సైబర్ సెక్యూరిటీ హెచ్చిరించింది. ఆయా సంస్థలు తమ వినియోగదారుల ఆస్తులు, డేటాను కాపాడే చర్యలు చేపట్టాలని కూడా హెచ్చరించింది.

‘‘ ఔటేజ్ విండోస్ 10, తదనంతర సిస్టంలను ప్రభావితం చేసింది. క్రౌడ్ స్ట్రయిక్ ఫాల్కన్ కంటెంట్ అప్డేట్ కారణంగానే ఈ ఔటేజ్ సంభవించింది తప్ప, హానికరమైన సైబర్ కార్యకలాపాల వల్ల కాదు’’ అని నాదెళ్ల ‘ఎక్స్’ పోస్ట్ లో తెలిపారు. ‘‘ మేము ఈ సమస్యను గుర్తించాము. క్రౌడ్ స్ట్రయిక్ తో, ఐటి పరిశ్రమ తో కలిసి పనిచేస్తున్నాము. కస్టమర్లకు సాంకేతిక మార్గదర్శకత్వం, మద్దతు ఇచ్చి సిస్టమ్స్ లను మళ్లీ సురక్షితం గావించేందుకు కృషి చేస్తున్నాము’’ అని ఆయన తెలిపారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News