- Advertisement -
ముంబై : భారీ వర్షాల కారణంగా ముంబై గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం ఉదయం 10.30 గంటలకు ఓ భవనం లోని ఒక భాగం కూలి ఇద్దరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. భవనం లోని ఒక భాగం పూర్తిగా కూలిపోగా, మరికొంత భాగం వేలాడుతూ ఉంది.
అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు13 మందిని రక్షించారు. భవనం లోని నివాసితులు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని, వారిని బయటకు తీయడానికి సహాయ చర్యలు కొనసాగుతున్నాయని పోలీస్‌లు పేర్కొన్నారు.
- Advertisement -