Monday, November 25, 2024

ఇప్పటికీ.. ఎప్పటికీ మేటిగడ్డే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉద్ధృతంగా ప్రవ హిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకు పోయాయని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని అన్నారు. పోటె త్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపం చలయ్యాయని, కానీ, కెసిఆర్ సమున్నత సం కల్పం జై కొడుతోంది, జల హారతి పడుతోంద ని పేర్కొన్నారు. లక్షల క్యూసెక్కుల గంగా ప్ర వాహంలో లక్ష కోట్లు వృథా చేశారనే విమ ర్శలే గల్లంతయ్యాయని స్పష్టం చేశారు. కానీ మేడి

గడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిల బడిందని, కొండంత బలాన్ని చాటి చెబు తోం దని హర్షం వ్యక్తం చేశారు.ఎవరెన్ని కుతం త్రా లుచేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ, ఎప్పటికీ మేడిగడ్డే ..మన రై తుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ అని వివరించా రు. కాళేశ్వరమే కరవును పారదోలే కల్పతరువు అని కొనియాడారు. బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన కెసిఆర్‌కు తెలంగాణ సమా జంపక్షాన మరోసారి సెల్యూట్ …జై తెలంగాణ …జై కాళేశ్వరమంటూ కెటిఆర్ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News