Friday, October 18, 2024

నిరసన తెలుపుతున్న మహిళా రైతులపై ట్రక్కు మట్టి పోసి….

- Advertisement -
- Advertisement -

భోపాల్: తన భూమిలో రోడ్డు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన ఇద్దరు మహిళపై ట్రక్కు మట్టి లోడ్‌ను పోశారు. దీంతో సదరు మహిళలు మట్టిలో కూరుకుపోయిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని రేవా జిల్లా మంగావా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… హినోత్ జోరాట్ గ్రామంలో మమతా పాండే, ఆశా పాండే మహిళలు వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. వాళ్లు పంటలు పండించే భూమిలో నుంచి రోడ్డు చేపడుతామని చెప్పడంతో సదరు మహిళలు వ్యతిరేకించారు. వారు లీజు తీసుకున్న భూమిలో మట్టి పోసేందుకు ట్రక్కు రావడంతో మమతా, ఆశాలకు అడ్డుకున్నారు. అక్కడ నిలబడి నిరసన తెలుపుతున్న మహిళలపై ట్రక్కు డ్రైవర్ మట్టిపోయడంతో మట్టిలో కూరుకుపోయారు.

తల మాత్రమే బయటకు కనిపించగా దేహం మొత్తం మట్టిలో కూరుకుపోయింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని మట్టిలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియోను భోపాల్ కాంగ్రెస్ తన ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. మహిళా రైతులతో ప్రవర్తించే పద్దతి ఇదేనా అని నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళా రైతులకు జరుగుతున్న నష్టాన్ని ఇచ్చిన తరువాత రోడ్డు పనులు చేపడితే బాగుండేదని నెటిజన్లు వాపోతున్నారు. ఇలాంటి దుశ్చర్యాలకు పాల్పడడం సరికాదని మండిపడుతున్నారు. వారిపై మట్టి పోసి ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్టు సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News