Friday, December 20, 2024

సొంత ఇంట్లో దొంగతనం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు… ఎలా దొరికాడో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: సొంత ఇంట్లో దొంగతనం చేశాడు. అనంతరం భార్యతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ సిసి కెమెరాలు సొంతింటి దొంగను పట్టించిన సంఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ అనే దంపతులు నివసిస్తున్నారు అనితా స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. ప్రతీ రోజు అనితను స్కూల్లో దింపి సాయంత్రం ఇంటికి తీసుకొని వచ్చేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది.

బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించకపోవడంతో దొంగతనం జరిగిందని తెలుసుకొని దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా దంపతుల ఇంటికి పోలీసులు వచ్చారు. ఇంటికి సమీపంలో ఉన్న సిసి కెమెరాను పరిశీలించగా విస్తుపోయే నిజాలు తెలియడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే శివను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో పశ్నించడంతో తానే దొంగతనం చేసినట్టు పోలీసులు నిజాలు ఒప్పుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News