Monday, December 23, 2024

లోక్‌సభ సభ్యునిగా శత్రుఘ్న సిన్హా ప్రమాణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టిఎంసి ఎంపి శత్రుఘ్న సిన్హా సోమవారం లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి గెలుపొందిన సిన్హా లోక్‌సభ సభ్యునిగా ప్రమాణం చేసిన చివరి ఎంపి కావడం విశేషం. సోమవారం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే శత్రుఘ్న సిన్హా పేరును పెక్రటరీ జనరల్ పిలువగా స్పీకర్ ఓం బిర్లా ఆయన చేత ప్రమాణం చేయించారు.

జూన్‌లో జరిగిన లోక్‌సభ మొదటి సమావేశంలో సభ్యుడిగా సిన్హా ప్రమాణం చేయలేకపోయారు. లోక్‌సభ పూర్తి బలం 543 కాగా రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాయబరేలిలో కొనసాగాలని నిర్ణయించుకుని కేరళలోని వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఒక్క స్థానం తప్ప మిగిలిన 542 స్థానాలకు చెందిన సభ్యులు ప్రమాణం చేయడం పూర్తయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News