Friday, October 18, 2024

పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 వేల పింఛన్.. ప్రభుత్వం జీవో జారీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః కనుమరుగు అవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేంవత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెల రూ.25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశామని పేర్కొన్నారు.

పద్మ విభూషన్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ గ్రహీతలకు రూ.25 వేల పింఛన్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. భాష, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పింఛన్ డబ్బులు నేరుగా వారి ఖతాల్లో జమ చేస్తామని జూపల్లి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News