Thursday, September 19, 2024

‘దేవర 2’లో జాన్వీ పాత్రకు మరింత ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ఫస్ట్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి జాన్వీ కపూర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దేవర సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆమె తెలిపింది. ఇక దేవర సినిమాలో తన పాత్ర బాగుంటుందని, దేవర పార్ట్-2లో తన పాత్రకు మరింత స్కోప్ ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో దేవర పార్ట్-1లో జాన్వీ పాత్ర ఎలా ఉంటుందా.. పార్ట్-2లో ఆమె పాత్రను హైలైట్ చేయనున్నారా.. అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దేవర పార్ట్-1 చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News