ముంబై: నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. రోజంతా లాభ నష్టాలతో దోబూచులాట కొనసాగింది. దీర్ఘకాలిక లాభాలపై పన్ను భారం మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. చివరకు సెన్సెక్స్ నష్టాల బాట పట్టింది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది. సెన్సెక్స్ 73.04 పాయింట్లు లేక 0.09 శాతం నష్టపోయి 80429.04 వద్ద ముగిసింది. నిప్టీ 30.21 పాయింట్లు లేక 0.12 శాతం నష్టపోయి 24479.05 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో ఆస్ట్రాజెన్కా, నెట్ వర్క్ 18 మీడియా, సిఈ ఇన్ఫో సిస్టమ్స్, అసాహీ ఇండ్ గ్లాస్ లాభపడగా, నష్టపోయిన షేర్లలో ఇర్కాన్ ఇంటర్నేషనల్, రాష్ట్రీయకెమికల్స్, ఫ్యాక్ట్, రైల్టెల్ కార్పొరేషన్ ఉన్నాయి.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెంచడం వల్ల మార్కెట్ సెంటిమెంట్ చాలా వరకు దెబ్బతిన్నది. అందుకే నష్టాల్లో ముగిశాయి.
ఎల్టిసిజిని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. అలాగే సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను 0.0625 శాతం నుంచి 0.1 శాతానికి ఆప్షన్ ప్రీమియం పై పెంచారు. ఫ్యూచర్స్ పై 0.0125 శాతం నుంచి 0.02కు పెంచారు. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెరిగితే, అది వాల్యూమ్స్ ను తగ్గిస్తుంది. ఎందుకంటే ట్రేడర్లు ఫ్రీక్వెంట్ ట్రేడ్ చేయరు. ఎందుకంటే తరచూ ట్రేడ్ చేయడం ద్వారా మొత్తం మీద ట్రేడింగ్ కాస్ట్ పెరిగిపోతుంది.