Monday, December 23, 2024

ఆర్టీసీని చంపే ప్రయత్నం చేశారు: హరీశ్‌రావుకు మంత్రి పొన్నం కౌంటర్

- Advertisement -
- Advertisement -

ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. ఆర్టీసీపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. గత పదేళ్లలో ఆర్టీసీ సంస్థను చంపే ప్రయత్నం చేశారని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. “ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్‌ ఎన్నో హామీలు ఇచ్చింది.. ఆర్టీసీ కార్మికులను పీఆర్‌సీ పరిధిలోకి తెస్తామన్నారు. ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్‌మెంట్‌ డేట్‌ ప్రకటిస్తారు. కార్మికుల యూనియన్‌ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నించారు.

హరీశ్ రావు ప్రశ్నకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇస్తూ..  బిఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. యూనియన్లు రద్దు చేసి ఇప్పుడు పునరుద్ధరణ గురించి హరీశ్ రావు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదని.. ఆర్టీసీ సొమ్మును గత ప్రభుత్వం వాడుకుందని చెప్పారు. ఆర్టీసీకి తాము రూ.300 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నామని.. ఆర్టీసీలో 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామని మంత్రి పొన్నం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News