Monday, December 23, 2024

ఫ్యామిలీతో హాయిగా సేదతీరుతూ

- Advertisement -
- Advertisement -

సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభ వేడుక ఆహ్వానిస్తోంది” అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వి ట్టర్ వేదికగా ఫ్యామిలీతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. “ప్యారిస్‌కు వెళ్లే మార్గమధ్యంలో.. లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుం బం, మనవరాలు క్లీంకారతో ప్రశాంతమైన క్షణాలను ఆస్వాదిస్తున్నాను” అంటూ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశా రు. ఈ ఫొటోలో చి రంజీవి, ఆయన సతీమణి సురేఖ కొణిదెల, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీం కార ఉన్నారు. వీరం తా పార్క్‌లో ముచ్చటిస్తూ హాయిగా సేద తీరుతున్నారు.

’ఇంద్ర’ గ్రాండ్ రీ-రిలీజ్..

అశ్వనీ దత్ వైజయం తి మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్‌ని సెలబ్రేట్ చేస్తూ… మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ’ఇంద్ర’ గ్రాండ్ రీ-రిలీజ్ కానుంది. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంద్ర 2002లో జూలై 24న విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతేకాదు అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇంద్ర చిత్రం మూడు నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డులను గెలుచుకుంది. చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డు, తెలుగు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు రెండింటినీ గెలుచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News