- Advertisement -
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించింది. జైలులో కేజ్రీవాల్‌ను చంపడానికి బిజెపి కుట్రపన్నిందని ఆరోపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ జూన్ 3 నుంచి జులై 7వ తేదీన మధ్య ఆయన సుగర్ లెవల్స్ 26 సార్లు పడిపోయాయని చూపుతున్న వైద్య నివేదికను ఉటంకిస్తోంది.
బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా కేజ్రీవాల్ ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఇండియా కూటమిలో భాగస్వామ్యపక్షమైన ఆప్ ఆరోపించింది. తీహార్ జైలులో క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ జులై 30న జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీని ఇండియా కూటమి నిర్వహిస్తుందని ఆప్ తెలిపింది.
- Advertisement -