Sunday, November 24, 2024

రూ.80 వేల లంచంతో దొరికిన పరకాల సబ్ రిజిస్ట్రార్

- Advertisement -
- Advertisement -

హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో సబ్ రిజిస్ట్రార్ గా సునీత విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాం పురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి పనిపై ఆఫీసుకు వచ్చారు. పని చేయటానికి 80 వేల రూపాయల సబ్ రిజిస్ట్రార్ సునీత లంచం డిమాండ్ చేశారు. దీంతో శ్రీకాంత్ ఎసిబి అధికారులను ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం ఎసిబి అధికారుల సూచ నలతో సబ్ రిజిస్ట్రార్ సునీత్ అడిగిన 80 వేల రూపాయలు ఇవ్వటానికి శ్రీకాంత్ ఓకే చెప్పాడు.

ఈ క్రమంలోనే గురువారం ఉదయం 80 వేల రూపాయలు లంచం డబ్బు తీసుకుంటుండగా మధ్యవర్తిని ఎసిబి అధికారులు పట్టుకున్నారు. విచారణ చేయగా సబ్ రిజిస్ట్రార్ సునీత పేరు చెప్పాడు అతను. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఎసిబి అధికారులు విచారణ చేస్తున్నారు. ఆఫీసులోనే తనిఖీలు చేస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ గతంలో చేసిన రిజిస్ట్రేషన్ల పైనా ఆరా తీస్తున్నారు. పాత రికార్డులు పరిశీలించారు. ఎసిబి తనిఖీలతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News